Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

Advertiesment
donald trump

ఠాగూర్

, ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (18:32 IST)
తమ దేశంలో 30 రోజులకు మించి ఉంటున్నవారికి అమెరికా హోం శాఖ ఓ షరతు విధించింది. 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు తమ వివరాలను ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్ వద్ద విధిగా రిజిస్టర్ చేసుకోవాలని హోం శాఖ కోరింది. అలా చేయకపోతే వారివారి దేశాలకు  తిప్పిపంపుతామని హెచ్చరించింది. ఒకవేళ స్వదేశాలకు వెళ్లకపోతే జైలుశిక్ష తప్పదని తెలిపింది. చార్జీలకు డబ్బులు లేకపోతే రాయితీలు కూడా ఇస్తామని వెల్లడించింది. 
 
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నేరారోపణలు మోసి జరిమానా విధించడంతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని అమెరికా హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వెంటనే అమెరికాను విడిచి వెళ్లడమే ఉత్తమ మార్గమని సూచించింది. పైగా, అమెరికాను వీడటానికి ఇదేసరైన సమయమని, సామానులు సర్దుకుని స్వదేశానికి విమానం ఎక్కాలని హోంశాఖ సూచించింది. 
 
ఎటువంటి నేర చరిత్ర లేనివారు, ఇక్కడ సంపాదించుకున్న డబ్బుతో నిశ్చింతగా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా విమాన టికెట్ కొనుగోలు చేసే స్థోమత లేకపోతే అమెరికా ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపింది. నిబంధనలు పాటించని వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!