Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రి బెడ్ పైన చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం

Advertiesment
crime
దేశంలో మహిళలకు భద్రతలేకుండా పోయింది. రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా యువతులు ఒంటరిగా నిర్భయంగా తిరగలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. చివరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న ఎయిర్‌హోస్టెస్‌పై అఘాయిత్యం జరిగింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ ఎన్.సి.ఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధిత ఎయిర్ హోస్టెస్ గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. ఈ నెల 5వ తేదీన అక్కడున్న ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా, కిందపడటంతో అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను సమీపంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
మరుసటిరోజున అక్కడ వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే, ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బయటకు చెప్పలేదు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ఎదుట బాధితురాలు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, నిందితుడుని గుర్తించేందుకు ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్-బ్లింకిట్ డీల్: 10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్ కార్డుల డెలివరీ