Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వ బిల్లుకు గుర్తుగా కుమార్తెకు పేరు పెట్టిన పాక్ హిందూ శరణార్ధి

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:29 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు రాజ్యసభ బుధవారం ఆమోదముద్రవేసింది. ఈ బిల్లును గురువారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అయితే, క్యాబ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేయడం పట్ల పాకిస్తాన్ హిందూ శరణార్ధి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదీకూడా తన ఆరేళ్ళ కుమార్తెకు నాగరిక్తా అనే పేరు పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
ఆర్తీ దేవి అనే మహిళ పాక్ హిందూ శరణార్ధిగా న్యూఢిల్లీలోని శరణార్ధుల కాలనీలో నివసిస్తోంది. ఈమె పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తన ఆరేళ్ళ కుమార్తెకు నాగరిక్తా అనే పేరుపెట్టారు. ఆ తర్వాత ఆమె జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా 21 యేళ్ళ ఆర్తీ దేవి మాట్లాడుతూ, క్యాబ్‌కు ఎగువ సభ ఆమోదుముద్ర వేసిన శుభసందర్భంలో నా బిడ్డకు నాగరిక్తా అనే పేరు పెట్టినట్టు చెప్పారు. ఈ బిల్లు వల్ల తమ జీవితాల్లో కొంతైనా మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. తమకు పౌరసత్వం దక్కుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఆర్తీ దేవి సోమవారం 5 గంటల సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments