అందాల నటి శ్రియ. ఆమె హవా ఇపుడు బాగా తగ్గిపోయింది. సినీ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమెకు వచ్చే ఒక్కో ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె లండన్‌లో చిక్కుల్లో పడింది. అత్యంత గట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఆమెను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు క్షమాపణలు చెప్పి, వారి నుంచి బయటపడ్డారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రియ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు సుందకారి. ఈ చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. స్థానిక స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. శ్రియ పొరపాటున అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆమెకు తెలియకుండానే ప్రవేశించారు.
దీన్ని గమనించిన సాయుధ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాల్లేకుండా ఎందుకు వచ్చారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సమీపంలోనే ఉన్న నటుడు విమల్ వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని వివరించారు. సినిమా షూటింగ్ చేస్తున్నామని పోలీసులకు చెప్పి, అవసరమైన పత్రాలన్నీ చూపించారు. శ్రియ పోలీసులకు క్షమాపణ చెప్పడంతో వదిలిపెట్టారు. అనంతరం షూటింగ్ జరుపుకొన్నారు.