Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'క్యాబ్‌'కు రాజ్యసభ ఆమోదం ... అనుకూలం 125 - వ్యతిరేకం 105

'క్యాబ్‌'కు రాజ్యసభ ఆమోదం ... అనుకూలం 125 - వ్యతిరేకం 105
, గురువారం, 12 డిశెంబరు 2019 (10:37 IST)
పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదముద్రవేసింది. ఈ బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు మద్దతు తెలుపగా, వ్యతిరేకంగా 105 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో గురువారం ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 
ఈ బిల్లును బుధవారం హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆరున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతం ప్రాతిపదికన ప్రజలమధ్య విభజన రేఖ గీస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శరణార్థుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని ప్రశ్నించాయి. 
 
ఆ తర్వాత విపక్ష సభ్యుల ప్రశ్నలకు హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిచ్చారు. దేశంలోని ముస్లింలకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం కలుగదని స్పష్టంచేశారు. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 మంది ఎంపీలు ఓటేశారు. ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్‌ను బహిష్కరించింది. 
 
కాగా, ఈ బిల్లుకు జేడీయూ, అకాలీదళ్‌, ఏఐఏడీఎంకే, వైసీపీ, టీడీపీ, బీపీఎఫ్‌ తదితర పార్టీలు మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిస్తూ ‘ప్రజాస్వా మ్య చరిత్రలో ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు : అస్సోంలో కేంద్రమంత్రి ఇంటిపై దాడి