Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవెంజర్స్ విలన్ థానోస్ అవతారమెత్తిన డొనాల్డ్ ట్రంప్ (వీడియో వైరల్)

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:21 IST)
రిపబ్లికన్ పార్టీని దెబ్బిపొడిచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హాలీవుడ్ సినిమా విలన్ అయిన తానోస్‌లా చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా అధినేత ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షుడు జో బిటెన్‌పై ఉక్రెయిన్‌లో విచారణ జరపాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ గుర్రుగా వుంది. అంతేగాకుండా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలైంది. ట్రంప్ వార్ రూమ్ అనే ట్రంప్ వ్యతిరేక బృందం.. ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ట్రంప్ అవెంజర్స్ సినిమా విలన్ థానోస్‌ల కనిపించాడు. 
 
ఆ సినిమాలో థానోస్ ఇన్ఫినిటి రాక్స్‌ను ధరించి చిటికేసి ప్రపంచంలోని సగం జనాన్ని నశింప చేస్తాడు. అదే పాత్రలో ట్రంప్ చిటికేసే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రంప్ చిటికేసిన వెంటనే డెమోక్రటిక్ పార్టీ సభ్యులు విచారణ లేకుండా తప్పుకున్నట్లు వుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ వీడియోను మీరూ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments