Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం.. భారత్-నేపాల్‌ల మధ్య రచ్చ.. నో డౌట్?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (19:22 IST)
గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. రామ జన్మభూమి వివాదం సద్దుమణిగిందని అనుకునే లోపే గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం మొదలైంది. ఈ వివాదం భారత్-నేపాల్ దేశాల మధ్య జరుగుతోంది. 
 
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీమని అన్నారు. అయితే ఇదే ప్రసంగంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ అన్నట్టు నేపాల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ జై శంకర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
 
బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ లో పర్యటించిప్పుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. 
 
దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్యా బౌద్ధమత వారసత్వం ఉంది. గౌతమ బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించాడని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments