నిర్మలా సీతారామన్‌ నాకు స్నేహితురాలు : నోబెల్ పురస్కార గ్రహీత

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:03 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు స్నేహితురాలని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) తాము కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు. 
 
1983లో అభిజిత్‌ జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తిచేయగా, నిర్మలాసీతారామన్‌ కూడా ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌తోపాటు 1984లో ఎంఫిల్‌ పూర్తిచేశారు. దేశం గురించి జేఎన్‌యూలో తాను ఎంతో నేర్చుకున్నానని అభిజిత్‌ తెలిపారు. 
 
నిర్మల తనకు స్నేహితురాలని, ఆమె చాలా తెలివైనవారన్నారు. అప్పట్లో తమ రాజకీయ భావనలు కూడా నాటకీయంగా భిన్నంగా ఉండేవి కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల తాను విమర్శలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. 'గతంలో నేను చేసిన వ్యాఖ్యలను వారు పరిశీలించాలి. యూపీఏ పాలనపైనా నేను తీవ్ర విమర్శలు చేశాను' అని గుర్తుచేశారు. 
 
కాగా, పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపిన అభిజిత్‌కు ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అభిజిత్‌తోపాటు ఆయన భార్య డ్యుఫ్లో, మైఖెల్‌ క్రేమర్‌ కూడా నోబెల్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో నివసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments