భారత సంతతికి చెందిన ఆర్థికవేత్తకు నోబెల్ పురస్కారం

సోమవారం, 14 అక్టోబరు 2019 (16:43 IST)
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం మరో భారతీయుడుకి దక్కింది. 2019 సంవత్సరానికిగాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
వీరిద్దరే కాకుండా మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచ పేదరికాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే అంశంలో ఈ త్రయం పరిశోధనాత్మక దృక్పథంతో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.
 
సామాజిక ఆర్థిక శాస్త్రంలో కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. మరోవైపు, అభిజిత్ బెనర్జీ చేసిన అనేక సలహాలు, సూచనలను భారత్ వంటి పలు దేశాలు పాటించాయి. పేద విద్యార్థుల ఆర్థికస్థితి మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదపడింది. 
 
'పేదరికంతో పోరాటం' చేసినందుకుగాను అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. 'ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ ముగ్గురి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని' రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ టెలిఫోన్ సేవల పునరుద్ధరణ