జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టం.. వారానికి 2లేదా 2 రోజులు లీవ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (17:20 IST)
జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్‌తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.
 
వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని భావిస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే, అధికారిక పనిగంటలు పెరుగుతాయి. 
 
ఇప్పుడున్న 8-9 గంటలకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఓటీ సమయం 50 నుంచి 150 గంటలకు పెరుగుతుంది. పీఎఫ్‌లో కార్మికుడు, యజమాని జమచేసే వాటా కూడా పెరుగుతుంది.
 
గ్రాస్ వేతనంలో 50 శాతం బేసిక్‌ ఉండాలి..పీఎఫ్‌కి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది.ఆ సంస్థ యజమాని కూడా అంతే జమ చెయ్యాలి..రిటర్మెంట్ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ పెరుగుతాయి.
 
ఈ చట్టాలు అమల్లోకి వస్తే, అన్ని కంపెనీలు కార్మికులకు వారానికి రెండు, నుంచి మూడు రోజులు వీకాఫ్‌ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వేతన కోడ్ ప్రకారం.. వారానికి 48 గంటలు ఉద్యోగి పని చేయాల్సి ఉంటుంది.. ఏ సమయాలు అనేది పూర్తిగా ఆయా కంపెనీల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments