Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త కార్మిక చట్టం.. 12 గంటల పనివేళలు.. మూడు వీక్లీ ఆఫ్‌లు.. జూలై 1 నుంచి అమలు?

office work
, శుక్రవారం, 10 జూన్ 2022 (22:17 IST)
కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తేవాలని ఆలోచిస్తోంది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఈ కోడ్ ను అమల్లొకి తీసుకురావాలని భావిస్తున్నారు. పాత లేబర్ చట్టాల స్థానంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. 
 
కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కార్యాలయ పని వేళలు, జీతం, ఉద్యోగుల భవిష్య నిధి వంటి వాటిలో చాలా మార్పులు వస్తాయి. కొత్త సంస్కరణల ద్వారా లేబర్ కోడ్‌ వేతనాలు, సామాజిక భద్రత (పెన్షన్, గ్రాట్యుటీ), కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కొత్త చట్టాలు జూలై 1 నుంచి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
 
కొత్త కార్మిక చట్టంలోని అంశాలను ఓసారి పరిశీలిస్తే.. 
 
కార్యాలయ పని వేళల్లో పూర్తిగా మారిపోతాయి. 8-9 గంటల నుంచి 12 గంటలకు పెంచవచ్చు. ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రాథమిక వేతనాన్ని స్థూల జీతంలో 50%గా ఉండవచ్చు. జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.
 
పరిశ్రమల్లో కార్మికులకు గరిష్ట ఓవర్‌టైమ్ 50 గంటల నుండి 125 గంటలకు పెరుగుతుంది. ఉద్యోగుల PF ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.
 
పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరగడం వలన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని ప్రభుత్వం యోచిస్తుంది. సెలవుల అర్హత సంవత్సరంలో 240 రోజుల నుంచి 180 రోజులకు తగ్గుతుంది. అంటే ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా వచ్చిన వార్షిక మొత్తం రూ.123,727 మిలియన్లు