Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నమో'' యాప్‌తో డేంజర్.. వ్యంగ్యంగా రాహుల్ గాంధీ ట్వీట్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ప్రభుత్వం రూపొందించిన ''నమో'' యాప్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ హెచ్చరించారు. ఈ యాప్ ఉపయోగించే యూజర్ల సమాచా

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (17:16 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ప్రభుత్వం రూపొందించిన ''నమో'' యాప్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ హెచ్చరించారు. ఈ యాప్ ఉపయోగించే యూజర్ల సమాచారం రహస్యంగా అమెరికాకు చెందిన ''క్లెవర్ ట్యాప్'' అనే సంస్థకు చేరుతోందని ఎల్డర్సన్ తెలిపారు. 
 
నమో యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు సహా ఫోటోలు కూడా సంస్థకు చేరుతున్నట్లు ఎల్డర్సన్ చెప్పారు. క్లెవర్ ట్యాప్ ఓ అత్యాధునిక యాప్ నిర్వహణ వేదికని, యూజర్లను గుర్తించి డెవలపర్స్‌ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ నిపుణులకు ఇది సాయపడుతుందని ఎల్డర్సన్ వివరించారు. ఇక యూజర్ల సమాచారాన్ని కెప్లెర్ ఎందుకు భద్రపరుస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమని తెలిపారు.
 
ఈ యాప్‌పా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో రాహుల్ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ''హాయ్ నా పేరు నరేంద్రమోదీ. నేను భారత ప్రధానమంత్రిని. మీరు నా మొబైల్ యాప్‌లో సైన్ ఇన్ అయినప్పుడు మీ డేటా మొత్తాన్ని నేను అమెరికన్ కంపెనీల్లోని నా స్నేహితులకు చేరవేస్తాను'' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments