Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా పారిశ్రామికవేత్తలు కోట్లు కొల్లగొట్టి పారిపోతున్నారు: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాజకీయ నేతలు నిప్పులు చెరుగుతుంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిప

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (16:03 IST)
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాజకీయ నేతలు నిప్పులు చెరుగుతుంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతుంటే.. కేంద్రం మౌనంగా వుందని కేటీఆర్ విమర్శించారు. ఇదే సమయంలో కేంద్రం చిన్న పారిశ్రామికవేత్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి మాటలే తప్ప, చేతల్లో ఏం లేవని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఐటీఐఆర్, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ, ఐటీ విస్తరణకు తామే చర్యలు చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ ద్వారా 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి బడా పారిశ్రామిక వేత్తలు కోట్లు దోచుకుని పారిపోతుంటే కేంద్రం చేతులు ముడుచుకుని కూర్చుందని కేటీఆర్ అన్నారు. 
 
మరోవైపు విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు, విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉంటున్నారని, వీళ్లిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయ్ మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. వీరిద్దరూ ఆర్థిక నేరస్థులని, వారి మధ్య వ్యత్యాసమేమీ లేదని, అలాంటప్పుడు విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? అంటూ చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments