Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాళ్లతో భర్త జల్సాలు... భార్యను గొంతుకోసేశాడు..

Webdunia
సోమవారం, 23 మే 2022 (22:21 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్య సహిస్తుందని.. ఇద్దరు ప్రియురాళ్లతో ఒకే బెడ్ రూమ్‌లో జల్సాలకు దిగాడు. అయిన భార్య సహిస్తుందని ఏకంగా ఇంట్లో బెడు రూంలోకే తీసుకొచ్చి నిండు ప్రాణాన్ని తీశాడు. 
 
ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన అతడిని కన్న తల్లిదండ్రులే పోలీసులకు పట్టించారు. ఈ విషాద ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా సమీపంలోని తజ్‌నాగారి ప్రాంతానికి చెందిన ఉమాంగ్ చౌదరి ఉమాంగ్‌ దయాల్‌ బాగ్‌లో కార్ల వాషింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. 
 
అతడికి గత డిసెంబర్ 11న తజ్‌నాగారి చెందిన ప్రీతితో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె రెండున్నర నెలల గర్భిణి. ఉమాంగ్ చౌదరికి మద్యం తాగే అలవాటుతోపాటు ప్రియురాళ్లు ఉన్నారు. వాళ్లతో విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాలు చేసేవాడు. 
 
అతడి చెడు అలవాట్లను మార్చడానికే తల్లిదండ్రులు వివాహం చేశారు. అయినా అతడితో ఎలాంటి మార్పు రాలేదు. నిత్యం మద్యం తాగుతూ లవర్స్‌తో ఎంజాయ్ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడికి నచ్చచెప్పింది. 
 
అయినా ప్రియురాళ్లను ఇంటికి పిలుపించుకున్నాడు. వాళ్లు నేరుగా బెడ్రూంలోకి వెళ్లి అతడితో సరసాలాడుతూ కూర్చున్నారు. వారి చేష్టలకు ఆగ్రహించిన భార్య ఆ ఇద్దరు యువతులను వెళ్లిపోవాలని గొడవకు దిగింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన భర్త ఉమాంగ్ చౌదరి ప్రియురాళ్ల ముందే ప్రీతిపై దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే మృతిచెందింది. ప్రియురాళ్ల కోసం గర్భంతో ఉన్న భార్యను హత్య చేయడం విషాదంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments