Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంజన గల్రానీ

Advertiesment
sanjana
, శుక్రవారం, 20 మే 2022 (09:49 IST)
బుజ్జిగాడు హీరోయిన్ సంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
కాగా శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంజన.. బెయిల్‌పై బయటకు వచ్చి ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది.
 
తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ సంజన. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 
 
సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ఇటీవల తన సీమంతానికి సంబంధించిన ఫోటోలు ఆమె పోస్టు చేసి ఫ్యాన్స్‌కి ఆనందాన్ని కలిగించింది.
 
కేవలం కన్నడలోనే కాకుండా బహుభాషా చిత్రాల్లోనూ నటించిన సంజన కొద్ది రోజుల క్రితం తాను గర్భవతి అనే విషయాన్నిసోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. సోషల్ నెట్‌వర్కింగ్‌లో మరింత చురుకుగా ఉండే సంజన తన జీవితంలోని అందమైన క్షణాలను అభిమానులకు షేర్ చేస్తూ వస్తోంది.
 
కర్ణాటకకు చెందిన డాక్టర్‌ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. గతేడాది లాక్ డౌన్‌లోనే వివాహం చేసుకున్న సంజన..రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది. 
 
మరోవైపు, సంజనా గల్రానీ సోదరి, నిక్కీ గల్రానీ వివాహం నటుడు ఆది పినిశెట్టితో నిన్న చెన్నైలో సంప్రదాయబద్ధంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త చైతన్యతో లిప్ లాక్.. నిహారిక ఆ ఫోటో నెట్టింట పెట్టడం అవసరమా?