Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌లో బ్యాంకులకు సెలవు... 18 రోజులు హాలిడేస్

Webdunia
సోమవారం, 23 మే 2022 (21:49 IST)
జూన్‌లో బ్యాంకుల సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలుపుకొని వచ్చేనెలలో మొత్తం 18 బ్యాంక్ సెలవులు రానున్నాయి. అన్ని జాతీయ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులకు ఈ సెలవుల జాబితా వర్తిస్తుంది.
 
ఈ సెలవులను ఆధారంగా చేసుకుని ఖాతాదారులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది.  వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది. 
 
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. జూన్ 2వ తేదీన తొలి హాలిడే వస్తుంది. ఆ రోజున మహారాణా ప్రతాప్ జయంతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆవిర్భావ దినోత్సవం అయినందున తెలంగాణలో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. 3వ తేదీన గురు అర్జున్ దేవ్ వర్ధంతి కారణంగా పంజాబ్‌లో బ్యాంకులు పని చేయవు.
 
5వ తేదీన ఆదివారం, 11వ తేదీన రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం సెలవులు ఉంటాయి. 14వ తేదీన సంత్ గురు కబీర్ జయంతిని పురస్కరించుకుని ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లల్లో సెలవులు. 
 
15వ తేదీన గురు హర్‌గోబింద్‌ జయంతి సందర్భంగా ఒడిశా, మిజోరం, జమ్మూకాశ్మీర్ బ్యాంకులు పని చేయవు. 19న ఆదివారం, 22న ఖార్చీ పూజ వల్ల త్రిపుర, 25న నాలుగో శనివారం, 26న ఆదివారం సెలవులు ఉంటాయి. 30న స్థానిక పండగ వల్ల మిజోరంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments