Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుతుందనే ఆశతో ఆర్నెల్లుగా తల్లి మృతదేహానికి పూజలు... ఎక్కడ?

అతనికి తల్లి అంటే పంచ ప్రాణాలు. ఆమె కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేందుకు ఏమాత్రం వెనుకాడడు. అలాంటి తల్లే తనను విడిచి వెళ్లిపోయింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ యువకుడు.. తన తల్లి మళ

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (11:17 IST)
అతనికి తల్లి అంటే పంచ ప్రాణాలు. ఆమె కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేందుకు ఏమాత్రం వెనుకాడడు. అలాంటి తల్లే తనను విడిచి వెళ్లిపోయింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ యువకుడు.. తన తల్లి మళ్లీ బతుకుతుందన్న ఆశతో తల్లి మృతదేహానికి ఆర్నెల్లుగా ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని విశ్వంపూర్ సమీపంలోని రామ్‌నగర్ గ్రామంలో శోభ్‌నాథ్‌ గోండ్, అతని భార్య కాళేశ్వరి, వీరి కుమారుడు అమెరికన్‌ సింగ్‌లు కలిసి ఉంటున్నారు. గత ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా కాళేశ్వరి మృతిచెందింది. అమెరికన్‌ సింగ్ తన తల్లి కాళేశ్వరికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేదు. పైగా తల్లి మృత దేహాన్నిఇంట్లోనే మంచం మీద ఉంచి ప్రతీరోజూ తాంత్రిక పూజలు చేస్తూ వచ్చాడు.
 
ఇలా ఆరు నెలల సమయం దాటిపోయింది. ఆ మృతదేహం అస్థిపంజరంలా మారిపోయింది. ఈ విషయం బయటకు లీకైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
తన తల్లి నిత్యం తనతో మాట్లాడుతూ ఉందనీ, తన తల్లి తిరిగి బతికి వస్తుందని, తన పూజలకు తండ్రి కూడా సహకరిస్తున్నాడని తెలిపాడు. గత ఆరు నెలలుగా ఇంట్లోకి  ఏ ఒక్కరినీ వీరు అడుగుపెట్టనీయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments