Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నతల్లి కాదు.. సైకో... సెల్‌ఫోన్‌కు బానిస...

తన ఇద్దరు కన్నబిడ్డలను హత్య చేసి ప్రియుడుతో పారిపోవాలని ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన నిందితురాలు అభిరామి కేసులో సరికొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఆమె కన్నబిడ్డల కంటే మొబైల్ ఫోన్‌కు బానిసగా మారింది

Advertiesment
కన్నతల్లి కాదు.. సైకో... సెల్‌ఫోన్‌కు బానిస...
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:37 IST)
తన ఇద్దరు కన్నబిడ్డలను హత్య చేసి ప్రియుడుతో పారిపోవాలని ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన నిందితురాలు అభిరామి కేసులో సరికొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఆమె కన్నబిడ్డల కంటే మొబైల్ ఫోన్‌కు బానిసగా మారింది. ఈ కారణంగానే కన్నబిడ్డల కంటే మొబైల్ ఫోనునే తన ప్రాణంగా చూసుకుంటూ వచ్చింది. అందువల్లే ప్రియుడు, మొబైల్ ఫోన్ మోజులోపడి ఇద్దరు బిడ్డలను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన కుండ్రత్తూరుకు చెందిన విజయన్ అనే బ్యాంకు ఉద్యోగి భార్య అభిరామి. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, అభిరామి స్థానికంగా ఓ బిర్యానీ దుకాణంలో పని చేసే ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
అతనితోనే కలిసి జీవించేందుకు తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి తాపించింది. ఆ పాలను తన భర్తకు కూడా తాపించాలని అనుకోగా, అదృష్టవశాత్తు విజయన్ ఆ రాత్రి ఇంటికి రాకపోవడంతో పాలను సేవించలేదు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన విజయన్‌కు భార్య ఇంట్లో లేకపోవడం, ఇద్దరు పిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. 
 
అనంతరం పోలీసులకు సమాచారం చేరవేయగా, రంగంలోకి దిగిన పోలీసులు... అభిరామి ప్రియుడిని తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత అభిరామిని నాగర్‌కోయిల్ బస్టాండులో అదుపులోకి తీసుకుని చెన్నైకు తీసుకొచ్చి, విచారణ చేపట్టగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఈ విచారణలో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డొచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురిచేసేదని తెలిసింది. ఈ క్రమంలో సైకోగా మారిన అభిరామి పిల్లలను హత్యచేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరాశలో మేయర్ బొంతు రామ్మోహన్... ఫోన్ స్విచ్చాఫ్