Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!

Webdunia
సోమవారం, 13 జులై 2020 (18:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఒక వరుడు ఇద్దరు వధువులను పెద్దలు కుదిర్చిన ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వివాహానికి వధువులిద్దరూ సమ్మతించడమేకాకుండా, వారి తల్లిదండ్రులు కూడా అనుమతించారు. అలాగే, వరుడుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో ఈ పెళ్లి సుఖాంతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ఘోరాడోంగ్రీ బ్లాక్‌, కెరియా గ్రామానికి చెందిన సందీప్ యుకి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలోపడ్డాడు. ఈ విషయం తెలియక అతని తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు మరో యువతిని మాట్లాడారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన సందీప్ ప్రియురాలు... గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ పెద్దలు మూడు కుటుంబాలను పిలిచి మాట్లాడగా, ఇద్దరు యువతులు కలిసి సందీప్‌ను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. అలాగే, వరుడు కూడా వధువులిద్దరినీ వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఒకే ముహూర్తానికి వధువులిద్దరి మెడలో వరుడు తాళికట్టడంతో ఈ విచిత్రమైన పెళ్లి తంతు పూర్తయింది. ఈ వివాహం జూలై 8వ తేదీన ఘనంగా జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments