Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు : పబ్‌జీ గేమ్ అడొద్దని మందలించారనీ....

webdunia
సోమవారం, 13 జులై 2020 (15:26 IST)
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. పబ్‌జీ గేమ్ అడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ బాలుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడిని అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు శ్యామ్‌ ఉరి వేసుకున్నాడు.
 
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, బాలుడిని పలమనేరు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని స్థానికులు చెప్పారు. తన తండ్రి మొబైల్ ఫోన్‌ను తీసుకుని రోజంతా పబ్‌జీ ఆడేవాడని, దీంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు కోప్పడ్డారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

రెడ్‌ఎక్స్‌ ప్రీమియం ప్లాన్లను బ్లాక్ చేసిన ట్రాయ్