Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:38 IST)
Marriage
తమిళనాడులో విషాధ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం ముందే కుమారుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలో కవణై గ్రామం ఉంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఊరికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా.. ఆయనకు అప్పు కుమారుడు.. ప్రస్తుతం లా చదువుతున్నాడు. 
 
అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ప్రియురాలు కూడా ఓకే చెప్పింది. అంతే తండ్రి భౌతిక కాయం ముందే ప్రేయసి మెడలో తాళి కట్టేశాడు. 
 
కన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు. కొత్త జంటను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు ఆశీర్వదించారు. కాకపోతే అమ్మాయి తరఫు బంధువులు ఈ పెళ్లికి రాలేదు.. పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments