భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరు పదుల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఈయన పార్టీ కార్యకర్త, తన సన్నిహితురాలైన రింకూ మజుందార్ (51)ని అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో శుక్రవారం వివాహం పెళ్లాడారు. బెంగాలీ సంప్రదాయ వివాహ దుస్తులు ధరించిన ఘోష్... తన సతీమణితో మీడియా ముందుకు వచ్చారు. అయితే, తన తల్లి కోరిక మేరకే ఈ వివాహం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా, దిలీప్ ఘోష్ ఇప్పటివరకు బ్రహ్మచారిగా ఉండగా, రింకూ మజుందార్‌కు మాత్రం ఇది రెండో వివాహం. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్‌లో క్రియాశీలకంగా ఉన్న దిలీప్ ఘోష్... బీజేపీలో వివిధ హోదాల్లో పార్టీకి సేవలు అందించారు.
2015లో బీజేపీ వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఎంపీగానూ సేవలు అందించారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నపుడే వామపక్షాల స్థానాన్ని ఆక్రమించి బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోష్ కీలకంగా వ్యవహరించి పార్టీని విజయపథంలో నడిపించాలన్న పట్టుదలతో ఉన్నారు.