Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు.. భార్య బతికిపోయింది..

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (15:42 IST)
భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సేలం, ఆత్తూరు సమీపం, కృష్ణాపురం గ్రామంలో భార్యశీలాన్ని శంకించాడు. తన ఇద్దరు పిల్లను కత్తితో హత్య చేశాడు. 
 
అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణాపురంలో అశోక్‌కుమార్‌ (42), తవమణి (38) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి విద్యారాణి (13), అరుళ్‌కుమారి (13) అనే ఇద్దరు కుమార్తెలు, అరుళ్‌ ప్రకాష్‌ (5) అనే కుమారుడున్నాడు. తాగుడుకు అలవాటు పడిన అశోక్‌కుమార్‌ భార్యను అనుమానించేవాడు. తవమణి శీలాన్ని శంకిస్తూ కొడుకు తనకు పుట్టలేదంటూ తవమణితో గొడవపెట్టుకున్నాడు. 
 
బుధవారం ఉదయం మరింత తాగి ఇంటికి చేరుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితో నిదురపోతున్న భార్యా, ముగ్గురు పిల్లలపై దాడి జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యారాణి, అరుళ్‌ ప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తవమణి, అరుళ్‌కుమారి తీవ్రంగా గాయపడ్డారు. 
 
నలుగురు మృతి చెందారని అనుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితోనే పక్కింటో దూరాడు. అతడిని చూసిన ఆ ఇంటిలోనివారు కేకలు వేశారు. పక్కింటివారు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్పీల్ బర్గ్ చిత్రంలా పెద్ద ప్రయోగం చేస్తున్న రా రాజా సినిమా : తమ్మారెడ్డి భరద్వాజ్

నల్లలుంగీ, చొక్కాతో దర్పంగా కూర్చున్న శివంగి

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం 3వేల మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments