Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

Advertiesment
Kalyan Ram, Vijayashanthi, Sai Manjrekar

దేవి

, గురువారం, 20 ఫిబ్రవరి 2025 (11:53 IST)
Kalyan Ram, Vijayashanthi, Sai Manjrekar
నందమూరి కల్యాణ్‌రామ్‌ లేటెస్ట్ మూవీ మెరుపు గా టైటిల్ ఖరారైనట్లు కనిపిస్తున్నది. త్యరలో అధికారికంగా ప్రకటించే సూచనలు వున్నాయి. హీరోగా సరియిన హిట్ కోసం చూస్తున్న కల్యాణ్‌రామ్‌ ఈసారి మెరుపు దాడి చేయబోతున్నాడు. హైదరాబాద్ శివారులోని అల్లుమియం ఫ్యాక్టరీ లో  షూటింగ్ జరుగుతుంది. బుధవారం రాత్రి ఓ పాటను ప్రముఖ తారాగణంతో చిత్ర దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి తెరకేక్కించారు. మెరుపు లాంటి కాన్సెప్ట్ తో వస్తున్నామని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
 
కాగా, ఈ పాటలో విజయశాంతి కూడా పాల్గొంది. ఈమె పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు వార్హలు వస్తున్నాయి. పోలీస్ పాత్రలో, ఆవేశం ఉన్న పాత్రలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అందుకే చాలా కాలం తర్వాత అటువంటి పాత్ర ఆమె కోసం రాసినట్లు సమాచారం. ఇక ఈ పాటలో వంద మంది డాన్సర్ లు పాల్గొన్నారు. సాగర్ మాస్టర్ కోరియోగ్రాఫి చేస్తున్నారు.
 
కల్యాణ్‌ రామ్ 21వ చిత్రంగా తెరకేక్కుతోంది. ఆయన సరసన సయీ మంజ్రేకర్‌ హీరోయిన్.గా నటిస్తోంది. గత ఏడాది ఈ  సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇప్పటికే సగం షూటింగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోక వర్ధన్, ముప్పా సునీల్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు కల్యాణ్‌ రామ్ ‘డెవిల్‌’ ‘ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌’ చిత్రంతో వచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్