మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో 17ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటోంది. ఇటీవల ఆ బాలికకు సామాజిక మాధ్యమాల ద్వారా కునియముత్తూరుకు చెందిన కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ బాలికను మాయమాటలతో కునియముత్తూరులో ఉన్న తన గదికి రప్పించుకున్నాడు ఆ విద్యార్థి. అక్కడకు వచ్చిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించాడు. అంతేగాక ఆరుగురు సహచర విద్యార్థులను కూడా తన గదికి రప్పించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. బాలికను సోమవారం ఉదయం వారు ఆమె ఇంటివద్ద విడిచిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.