భార్య దోసెలు చేసి పెట్టలేదని మనస్తాపం.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని భర్త..?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (10:46 IST)
చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆధునికత అనే పేరే కానీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఓపిక నశిస్తోంది. దీంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ భర్త భార్య దోసెలు చేసి పెట్టలేదన్న కోపంతో భర్త నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కుండ్రత్తూర్‌ నందంబాక్కం పెరియార్‌నగర్‌కు చెందిన రవిచంద్రన్‌(66) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. శనివారం రాత్రి పూటుగా తాగొచ్చిన రవిచంద్రన్‌... తనకు దోసెలు వేసివ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఆవేశానికి గురైన రవిచంద్రన్‌ తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆయన్ను క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కుండ్రత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments