Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ యూనివర్శీటీలు ఏవి?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (10:02 IST)
తెలుగు రాష్ట్రాల్లో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉత్తమమైన విశ్వవిద్యాలయాలు ఏవో చాలా మందికి తెలియవు. ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలనే బెస్ట్ యూనివర్శీటీలుగా చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఈ రెండు మాత్రమేకాకుండా మరికొన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. 
 
ఇదే అంశంపై ప్రముఖ పత్రిక ఔట్‌లుక్‌ దేశంలోని ఉత్తమమైనవిగా ఎంపిక చేసిన 75 యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి 5వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీకి 23వ స్థానం దక్కాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 54వ స్థానంలో ఉన్నాయి.
 
ఇకపోతే, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నంబర్‌ వన్‌గా నిలిచింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి రెండో స్థానం దక్కింది. వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ(కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)కు 32వ స్థానం దక్కింది. 
 
అలాగే, అకడమిక్‌, పరిశోధనా రంగాల్లో ప్రతిభ, పరిశ్రమలతో సంబంధాలు, ప్లేస్‌మెంట్‌ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిపాలన, అడ్మిషన్లు, వైవిధ్యం, అందుబాటు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఉత్తమ స్థాయిలో ఉన్న 25 సెంట్రల్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
 
దేశంలోని 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఉపకులపతి అప్పారావు అన్నారు. ప్రపంచంలోని టాప్‌వర్సిటీల్లో స్థానం దక్కించుకునేలా మరింత కృషి చేస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments