Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ క్రెడిట్ వినియోగదారులకు శుభవార్త

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:48 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్.బి.ఐ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కష్టాల కారణంగా మారటోరియం తీసుకుని, గడువు ముగిసినా బకాయిలు చెల్లించని క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఎస్.బి.ఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గడువును మరింత పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారులు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం, లేదంటే బ్యాంకు ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్ తివారీ తెలిపారు. ఈ రెండింటిలోనూ వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉంటుందని పేర్కొన్నారు. 
 
అయితే, ఇక్కడో కిటుకు ఉంది. ఎస్‌బీఐ రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే, మారటోరియడం గడువు ముగిసి బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు సిబిల్‌కు చేరవని తివారీ స్పష్టం చేశారు. అంతమాత్రాన వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments