అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్ సంస్థల నుంచి జరిమానా వసూల్ చేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) ఆదేశించింది. ఇందుకు సదరు సంస్థలు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
2016 రూపొందించిన ప్లాస్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఈ కామర్స్ సంస్థలు వ్యవహరించాలంటూ సీపీసీబీ పేర్కొన్నది. ప్యాకేజీల కోసం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను మళ్లీ సేకరిస్తున్నారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలని సీపీసీబీ తెలిపింది.
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టంలోని ప్రొవిజన్ 9(2) ప్రకారం.. ప్యాకింగ్ చేసిన సంస్థలే మళ్లీ వ్యర్ధాలను సేకేరించాలని ఎన్‌జీటీతో సీపీసీబీ తెలియజేసింది. వస్తువుల డెలివరీ కోసం అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు తక్కువ ప్లాస్టిక్ వాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీని కోరారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలపై సరైన రీతిలో జరిమానా వసూల్ చేయడం లేదని హరిత ట్రిబ్యునల్ పేర్కొన్నది.
పర్యావరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఆడిట్ నిర్వహించి, వాటి నుంచి నష్టపరిహారాన్ని వసూల్ చేయాలని ఎన్‌జీటీ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అక్టోబర్ 14వ తేదీలోగా దీనిపై మళ్లీ వివరణ ఇవ్వాలంటూ కోరింది.