Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలంబ్రాలు పోసుకుంటున్న వేళ వధూవరులను ఆశీర్వదించిన కోతి..?!

Advertiesment
తలంబ్రాలు పోసుకుంటున్న వేళ వధూవరులను ఆశీర్వదించిన కోతి..?!
, శనివారం, 12 సెప్టెంబరు 2020 (14:38 IST)
Monkey in marriage
తలంబ్రాలు పోసుకుంటున్న వేళ నూతన దంపతులకు మారుతి ఆశీర్వాదం లభించినట్లైంది. కొత్త జంట తలంబ్రాలు నెత్తిన పోసుకుంటున్న సందర్భంలో ఓ కోతి హఠాత్తుగా వచ్చి వారిని ఆశీర్వదించింది. అక్కడున్న వారిలో కొందరు కంగారు పడగా... మరికొందరు సంబర పడ్డారు. ఈ ఆసక్తికర ఘటన ములుగు జిల్లా మంగంపేట మండలం.. హేమాచల నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లో కరోనా కష్టకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిని గుళ్లో నిర్వహించారు. పెళ్లి తంతులో భాగంగా తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. ఉన్నట్లుండి వధూవరులపై కోతి దూకడంతో అక్కడి జనమంతా ఉలిక్కి పడ్డారు. 
 
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత దైవసన్నిధిలో జరుగుతున్న తమ పెళ్లి వేడుకకు సాక్షాత్తు ఆంజనేయస్వామివారే వచ్చి ఆశీర్వదించాడనే ఆత్మవిశ్వాసం వారిలో రెట్టింపయింది. అయితే కొత్త జంటను ఆశీర్వదిస్తున్న కోతి ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్, నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం ఆమేనా? బాట బాగా పడుతోందిగా...