Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెజాన్, రిలయన్స్‌కు గట్టిపోటీ.. ఈ-కామర్స్ బిజినెస్‌లోకి టాటా గ్రూప్‌

అమెజాన్, రిలయన్స్‌కు గట్టిపోటీ.. ఈ-కామర్స్ బిజినెస్‌లోకి టాటా గ్రూప్‌
, గురువారం, 27 ఆగస్టు 2020 (19:37 IST)
TATA Group
ఈ-కామర్స్ బిజినెస్‌లోకి టాటా గ్రూప్‌ ప్రవేశించనుంది. ఇటు అమెజాన్ అటు రిలయన్స్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆన్‌లైన్‌ సేవలతో వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచేందుకు ఈ కామర్స్‌ యాప్‌ను రూపొందించే పనిలో పడింది.
 
ఇప్పటికే దాదాపుగా యాప్‌ డిజైన్‌కు టాటా గ్రూప్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదంటే జనవరి నెలలో టాటా ఈ కామర్స్‌ బిజినెస్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ-కామర్స్‌ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ పెరిగింది. దీనితో టాటా గ్రూప్ ఈ కామర్స్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ కంపెనీలు కార్లు, ఎయిర్‌ కండీషనర్లు, లగ్జరీ హోటల్స్‌, డిపార్టమెంటల్‌ స్టోర్స్‌, సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ మొదలైనవన్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
వీటన్నింటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుందని టాటా గ్రూప్‌ భావిస్తోంది. దీనికోసం ఆల్‌ ఇన్‌ వన్‌ యాప్‌ను తీసుకొస్తోంది. కాగా, ఈ యాప్‌ రూపకల్పనలో టాటా డిజిటల్‌ విభాగం సీఈఓ ప్రతీక్‌ పాల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షెడ్యూల్ ప్రకారం "నీట్‌"గా పరీక్షలు : కేంద్రం స్పష్టీకరణ