Publish Date: Fri, 14 Aug 2020 (15:12 IST)
Updated Date: Fri, 14 Aug 2020 (15:14 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఔషధాలను కూడా ఆన్ లైన్‌లో విక్రయించాలని భావిస్తోంది. ఈ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమేజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమేజాన్ తన ఆన్‌లైన్ దుకాణంలో విక్రయించనుంది.
అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమేజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. భారత్‌లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అమేజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.