Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు - రక్షణ శాఖలో కూడా...

రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు - రక్షణ శాఖలో కూడా...
, గురువారం, 13 ఆగస్టు 2020 (14:56 IST)
బిలాస్‌పూర్ కేంద్రంగా ప‌నిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 అప్రెంటిస్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌ైంది. ఈ పోస్టులకు అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org.లో అందుబాటులో ఉన్నాయ‌ని, ఆగ‌స్టు 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 
 
మొత్తం అప్రెంటిస్‌లు: 432. ఇందులో కోపా-102, స్టెనోగ్రాఫ‌ర్ (హిందీ, ఇంగ్లిష్‌)-56, ఫిట్ట‌ర్‌- 91, ఎల‌క్ట్రీషియ‌న్‌‌-56, వైర్‌మెన్-‌56, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-7, ఆర్ఏసీ మెకానిక్‌-7, వెల్డ‌ర్‌- 45, ప్లంబ‌ర్‌-11, మేస‌న్‌-11, పెయింట‌ర్‌- 6, కార్పెంట‌ర్-11, మెషినిస్ట్‌-6, ట‌ర్న‌ర్‌-11, షీట్‌మెట‌ల్ వ‌ర్క‌ర్‌-11 చొప్పున పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, స‌ంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2020 జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి. ఈ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే, దరఖాస్తులను పూర్తిగా ఆన్‍‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. 
 
రక్షణ శాఖలో 60 ఉద్యోగాలు
 
అలాగే, భారత రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) మెడిక‌ల్ డివైజెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వార 60 ఉద్యోగాల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు ఈనెల 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 
 
ఈ 60 పోస్టుల్లో జ‌ర‌ల్-23 పోస్టులు, ఈడ‌బ్ల్యూఎస్-6, ఓబీసీ-17, ఎస్సీ-9, ఎస్టీ-5 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు... ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్ లేదా క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేష‌న్ లేదా మెడిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లేదా మెడిక‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ మొద‌టి శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 28 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌నల ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుంది. 
 
ఇంట‌ర్వ్యూ. విద్యార్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. ఇందులోకూడా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తును మాత్రం ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సివుంటుంది. దరఖాస్తు రుసుం కింద రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 నుంచి జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడింగ్