ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచియున్న నిరుద్యోగులకు శభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో లెక్చరర్, సైంటిఫిక్ ఆఫీసర్ వంటి పోస్టులు భర్తీ చేస్తుంది.
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 10 ఆగస్టు 2020న ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేయడానికి 27 ఆగస్టు 2020 చివరి తేదీగా నిర్ణయించారు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్ upsc.gov.inలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆసక్తిగల అభ్యర్థులు upsconline.nic.in వెబ్ సైట్లో రిక్రూట్మెంట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలని ప్రకటించింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 24
1. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 14
2. సైంటిఫిక్ ఆఫీసర్: 1
3. లెక్చరర్(ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థటిక్స్): 3
4. లెక్చరర్ (వొకేషనల్ గైడెన్స్): 2
5. లెక్చరర్(ఫిజియోథెరఫీ): 2
6. సబ్ ఎడిటర్: 2
ఇతర వివరాలు:
7. దరఖాస్తు ప్రారంభం 10 ఆగస్టు 2020
8. దరఖాస్తు చివరి తేదీ 27 ఆగస్టు 2020
విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
వయోపరిమితి:
9. సబ్ ఎడిటర్, జూనియర్ సైంటిస్ట్ పోస్టులకు 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
10. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.25. మహిళలకు ఫీజు లేదు.