Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - వారు వీరే...

Advertiesment
Civils Results
, బుధవారం, 5 ఆగస్టు 2020 (11:14 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ 2019 పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఏకంగా 31 మంది ర్యాంకులను కైవసం చేసుకున్నారు. కొందరు పట్టువదలని విక్రమార్కులను తలపించేలా కష్టించి అఖిలభారత సర్వీసులకు ఎంపికకాగా, కర్నూలుకు చెందిన సమీర్‌ రాజా(603) మాత్రం తొలి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకున్నారు. 
 
సివిల్స్‌కు ఎంపికైన వారిలో కడప జిల్లా నుంచి ముగ్గురు, కర్నూలు నుంచి ఇద్దరు, గుంటూరు నుంచి ఇద్దరు, విశాఖ, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం 2019 సివిల్స్‌ ఫలితాలను విడుదల చేసింది. 
 
కాగా, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన సూర్యతేజ ఐదో ప్రయత్నంలో 76వ ర్యాంకుతో సివిల్‌ సర్వీ్‌సకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు ఇదేకావడం విశేషం. సివిల్‌ సర్వీ్‌సకు దేశ వ్యాప్తంగా 829 మంది ఎంపిక కాగా.. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌ సింగ్‌ తొలిస్థానం, జతిన్‌ కిశోర్‌ (ఢిల్లీ) ద్వితీయ, ప్రతిభా వర్మ(యూపీ) తృతీయ స్థానాల్లో నిలిచారు. 
 
ఇకపోతే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారు, ర్యాంకులు.. మల్లవరపు సూర్యతేజ(76), సింగారెడ్డి రుషికేశ్‌ రెడ్డి(95), గొరిజాల మోహన్‌ కృష్ణ(283), జంగం కులదీప్‌(135), సి. సమీర్‌ రాజా(603), సి. చైతన్య కుమార్‌ రెడ్డి(250), బచ్చు ధీరజ్‌ కుమార్‌(768), తాటి మాకుల రాహుల్‌ కుమార్‌ రెడ్డి(117), చీమల శివగోపాల్‌ రెడ్డి(263), పెద్దిటి ధాత్రిరెడ్డి(46), కట్టా రవితేజ(77), విశాల్‌ తేజ్‌రాజ్‌ నర్వది(91), ఎంవీ సత్యసాయి కార్తీక్‌(103) ఉన్నారు. 
 
అలాగే, కె.ప్రేమసాగర్‌(170), బి.రాహుల్‌(272), వి.తేజదీపక్‌(279), ఎ.వెంకటేశ్వర రెడ్డి(314), ముత్తినేని సాయితేజ(344), రేణుకుంట శీతల్‌ కుమార్‌(417), ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి(427), కొల్లాబత్తుల కార్తీక్‌(428), ఎన్‌.వివేక్‌ రెడ్డి(485), నీతిపూడి రష్మితారావు(534), కోరుకొండ సిద్దార్థ(566), సుసాన్‌ బ్లెస్సీ బక్కి(585), చిలుముల రజనీకాంత్‌(598), కొప్పిశెట్టి కిరణ్మయి(633), పోలుమతి శరణ్య(653), దీపక్‌ సింగ్‌(686), డి.రమేశ్‌(690), పలని ఫణికిరణ్‌ ఎస్‌.(698), బుక్యా నరసింహస్వామి(741), కె.శశికాంత్‌ (764), రవికుమార్‌ మీనా(793) ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌కు కరోనా పాజిటివ్