కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో కరోనా వైరస్ సోకిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు ఈ వైరస్ సోకగా, ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఇపుడు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే డాక్టర్ల సూచనతో గురుగ్రామ్‌లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కాంటాక్ట్ అయిన కేంద్ర మంత్రులు రవిశంకర ప్రసాద్, బాబుల్‌లు ఇప్పటికే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అలాగే, మరికొందరు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.