Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 February 2025
webdunia

13వ సీజన్ ఐపీఎల్ 2020 విజేత ఎవరో తెలుసా?

Advertiesment
13వ సీజన్ ఐపీఎల్ 2020 విజేత ఎవరో తెలుసా?
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (19:22 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 పదమూడో సీజన్ టోర్నీ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని ఈ దఫా యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు.  తొలి మ్యాచ్ 19వ తేదీన జరుగనుంది. ఈ పోటీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. 
 
ఇక ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్న విషయమై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, 13వ సీజన్ కప్‌ను ఎగరేసుకుపోతుందని అంచనా వేశాడు. 
 
ఐపీఎల్ కవరేజ్ నిమిత్తం ముంబైకి చేరుకున్న బ్రెట్ లీ, కొవిడ్ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నాడు. తాను ఆడుతున్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసేవాడన్న పేరు తెచ్చుకున్న బ్రెట్ లీ, తాజాగా, ఇన్ స్టాగ్రామ్ వేదికగా, తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 
 
ఇందులోభాగంగానే, ఐపీఎల్ 2020 చాంపియన్స్ ఎవరన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. "చెప్పడం కాస్తంత కష్టమే. నేను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ వైపే వుంటాను" అని బ్రెట్ లీ సమాధానం ఇచ్చాడు. 
 
కాగా, బ్రెటి లీ గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరపున ఆడిన విషయం తెల్సిందే. ఈ సంవత్సరం కేకేఆర్ జట్టుకు పాట్ కమిన్స్ వెన్నుదన్నుగా నిలుస్తాడని, కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్స్ వరకూ వెళుతుందని అంచనా వేస్తున్నానని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌ : 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అధికంగా ఎవరు గెలుచుకున్నారు?