Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యభిచార డబ్బు పంపిణీలో ఘర్షణ ... యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?

Advertiesment
వ్యభిచార డబ్బు పంపిణీలో ఘర్షణ ... యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (08:56 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. వ్యభిచార డబ్బు పంపిణీలో వివాదం చెలరేగింది. దీంతో ఓ యువకుడి శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన చెన్నై అశోక్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థాని అశోక్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు కాలిన గాయాలతో పడివున్నాడని చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని చేపట్టిన విచారణలో, అతను ఢిల్లీ పూర్వికంగా ఉన్న దీపక్‌ అని, టి.నగర్‌లోని రెడీమేడ్‌ దుస్తుల విక్రయాలు చేస్తుంటాడని తెలిసింది. 
 
అదేసమయంలో వంట చేస్తుండగా ప్రమాదం సంభవించినట్టు దీపక్‌ పోలీసులకు తెలిపాడు. అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అతని శరీరంలో గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో అనుమానించిన పోలీసులు, అతని గదిని తనిఖీ చేయగా, రక్తపు మరకలతో ఉన్న కత్తి, కిరోసిన్‌ క్యాన్‌ను గుర్తించారు. అనంతరం దీపక్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను పరిశీలించగా, ఘటన జరగడానికి ముందు అతను రెండు నెంబర్లతో మాట్లాడినట్టు తెలిసింది. 
 
అలాగే, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, ఓ యువతి, యువకుడు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ రెండు నెంబర్లను ట్రేస్‌ చేయగా, చెన్నై విమానాశ్రయం వద్ద సిగ్నల్స్‌ లభించాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. 
 
వారు ఢిల్లీకి చెందిన హేమంత్‌, నీలలుగా గుర్తించారు. వీరిద్దరూ దీపక్‌తో కలసి వ్యాపారం చేస్తూ వచ్చారు. అయితే, అందులో లాభాలు లేకపోగా నష్టాలే వస్తుండటంతో హేమంత్‌ సలహా మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార వృత్తి నడపసాహారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే అమ్మాయలను ఓ వారం రోజుల పాటు ఉంచుకుని ఆ తర్వాత వారిని విమానాల ద్వారా స్వరాష్ట్రాలకు పంపిస్తున్నట్టు విచారణలో తేలింది. 
 
ఇలా వచ్చిన నీల అనే యువతి వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బును ఈ ముగ్గురు వాటాలు వేసుకోవడంలో ఘర్షణ తలెత్తింది. దీంతో హేమంత్‌, నీలలు కలిసి దీపక్‌ను కత్తితో పొడిచి, కిరోసిన్‌ పోసి తగులబెట్టి, ఇద్దరూ ముంబైకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లారని తేలింది. దీంతో, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకి కొత్త మార్గదర్శకాలా? రెండు సంవత్సరాలు ప్రయాణం, బయటి పుడ్ వద్దు, వాస్తవాలేంటి?