ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీకి సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద ఈ నెల 11న తొలివిడత డ్వాక్రా రుణాల నగదు చెల్లించనున్నారు. నాలుగు విడతల్లో మహిళల ఖాతాలకు ప్రభుత్వం జమచేయనుంది. మహిళల పేరిట ఇళ్ల పట్టాల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్ చేయూతతో 45 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఖాతాలకు నేరుగా రూ.18,750 చొప్పున జమచేశారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద చెల్లింపులకు ప్రణాళిక రూపొందించారు. తొలివిడత లబ్ధిని అందజేసేందుకు ఏర్పా ట్లు పూర్తిచేశారు.