సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీతో పాటు పోకర్ పైన కూడా నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ రోజు జరిగిన కేభినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
వీటిని ప్రోత్సాహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. అంతేకాదు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.
రాష్ట్రంలో ఆన్ లైన్లో జూదం ఆడేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని వీటి బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీటిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది.