Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతు మెదడులో భారీ రక్తనాళ వాపు వ్యాధి: బెంగళూరులోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవంతంగా శస్త్రచికిత్స

రైతు మెదడులో భారీ రక్తనాళ వాపు వ్యాధి: బెంగళూరులోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవంతంగా శస్త్రచికిత్స
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (15:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 40 సంవత్సరాల వయసు కలిగిన రైతు మసకగా ఉన్న కంటి చూపు, తడబడుతున్న మాట, ఎడమచేయి మరియు కాలులో తిమ్మిర్లు వంటి వాటి చేత రోజంతా ఇబ్బంది పడుతుండటం చేత తన రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడంలో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. తొలుత ఆయన తీసుకున్న చికిత్సతో ఎలాంటి ఉపశమనమూ పొందకపోవడం చేత ఆయన బెంగళూరులో మరిన్ని పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు.
 
హాస్పిటల్‌ వెలుపల సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ మరియు ఎంఆర్‌ యాంజియోగ్రామ్‌ను మెదడుకు చేసిన తరువాత ఆయన మెదడులోని కుడి మధ్య మస్తిష్క ధమని(ఎంసీఏ)లో భారీ పరిమాణంలో రక్త నాళం వాచి ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన తన క్లిష్ట పరిస్థితి కారణంగా బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌ వద్ద నున్న మణిపాల్‌ హాస్పిటల్స్‌కు చికిత్స కోసం వచ్చారు.
 
‘‘ఈయన మా వద్దకు కుడి మధ్య మస్తిష్క ధమని (ఎంసీఏ)లో భారీ రక్త నాళ వాపు వ్యాధి కారణంగా పాక్షిక మూర్చలు మరియు తలనొప్పితో వచ్చారు. మెదడులోని కదలికలకు సంబంధించిన విభాగాలకు రక్తసరఫరా చేసే అతి పెద్ద వనరు ఎంసీఏ. ఈ రక్త సరఫరాలో అవరోధాల వల్ల రోగి పక్షవాతం బారిన పడవచ్చు. భారీ రక్త నాళాల వాపు వ్యాధి లక్షణాలు మెదడులో కణితిలు లేదా స్ట్రోక్స్‌లా కనిపిస్తాయి.
 
దీనిని ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే మృత్యువు బారిన పడేందుకు అవకాశాలూ ఉన్నాయి. తీవ్రమైన శాశ్వత సమస్యలు లేకుండా ఈ రోగికి చికిత్స చేయడానికి సృజనాత్మక మరియు వ్యక్తిగతీకరించిన చికిత్స అవసరం’’ అని  చికిత్స చేసిన డాక్టర్‌ బోపన్న కెఎం, హెచ్‌ఓడీ అండ్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌, ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌, బెంగళూరు అన్నారు.
 
ఈ వాపు కారణంగా ఉత్పన్నమయ్యే భారీ పరిమాణంలో, లోతైన ప్రాంతంలో మరియు అవసరమైన రక్త నాళాలకు అతి క్లిష్టమైన న్యూరోసర్జికల్‌ పునర్నిర్మాణం ఈ వాపును తొలగించేందుకు మరియు అదే సమయంలో సాధారణ మెదడుకు రక్త సరఫరాను నిర్వహించడానికి అవసరం. ఈ తరహా అతి క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సలను చేయడంలో బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్దనున్న మణిపాల్‌ హాస్పిటల్స్‌ సుప్రసిద్ధం.
 
భారీ రక్త నాళాల వాపు వ్యాధులకు చికిత్స చాలా సంక్లిష్టంగా ఉంటుంటుంది. దీనికి ప్రధానంగా వాటి యొక్క సంక్లిష్టమైన శరీర నిర్మాణ శాస్త్రం కూడా కారణమవుతుంటుంది. శస్త్ర చికిత్స వ్యూహం మరియు అనుభవం వంటివి చికిత్సా ఫలితాలలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ తరహా శస్త్రచికిత్సలు అనుభవజ్ఞులైన  న్యూరోసర్జన్లతో పాటుగా చక్కటి న్యూరో-రీహాబిలిటేషన్‌ బృందం కలిగిన అత్యుత్తమ టెరిటరీ కేర్‌ సెంటర్‌లో మెరుగ్గా చేస్తారు.
 
శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల ఆధారంగా, ఈ రోగికి రెండు దశలలో శస్త్రచికిత్స చేశారు. తొలుత మైక్రోసర్జికల్‌ బైపాస్‌ (దీనినే మిడిల్‌ సెరెబ్రల్‌ ఆర్టెరీ ఎంసీఏ బైపాస్‌కు సూపర్‌ఫీషియల్‌ టెంపోరల్‌ ఆర్టెరీ ఎస్‌టీఏ అని కూడా అంటారు)ను దాత చర్మపు ధమని వినియోగించి మెదడుకు రక్తసరఫరాను మార్చారు. దీనిని అనుసరించి ఇంట్రా ఆపరేటివ్‌ యాంజియోగ్రామ్‌ ద్వారా బై-పాస్‌ ద్వారా తగినంతగా సరఫరా జరుగుతుందని నిర్థారించారు. అనంతరం ఉబ్బిన రక్తనాళంలోని రక్త సరఫరాను నిలిపి వేశారు మరియు దీనిని మరింతగా క్షీణించేలా చేయడం ద్వారా ప్రభావవంతమైన చికిత్సను అందించారు.
 
శస్త్రచికిత్స అనంతరం, ఆయనకు ఎడమ వైపు తాత్కాలికంగా నీరసం వచ్చింది. డాక్టర్‌ ధీరజ్‌ ఏ, హెచ్‌ఓడీ అండ్‌ కన్సల్టెంట్‌- ఫిజికల్‌ మెడిసన్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌, ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌ ఈ రోగిని పరీశించారు. అనంతరం ఈ రోగికి న్యూరో-రీహాబిలిటేషన ఇంటర్వెన్షన్‌ ప్రారంభించారు. దానితో పాటుగా ఫిజియోథెరఫీ, ఆక్యుపేషనల్‌ థెరఫీ మరియు స్పీచ్‌/లాంగ్వేజ్‌ థెరఫీ కూడా అందించారు.
 
‘‘సమగ్రమైన రీహాబిలిటేషన్‌కు ఆయన చక్కగా స్పందించారు మరియు ఆయనను ఇంటి వద్దనే న్యూరో– రీహాబిలిటేషన్‌ కార్యక్రమం కోసం డిశ్చార్జ్‌ చేయడం జరిగింది. ఈ రీహాబిలిటేషన్‌ బృందంలో ఆయన కుటుంబసభ్యులు కూడా భాగం కావడంతో పాటుగా ఈ రీహాబిలిటేషన్‌ ప్రక్రియలను ఇంటి వద్ద కొనసాగించారు. ఆయన దాదాపుగా కోలుకున్నారు. ఆయన బాగా నడువగలుగుతున్నారు మరియు స్వతంత్య్రంగా తన రోజువారీ కార్యకలాపాలను చేసుకోగలుగుతున్నారు మరియు ఇంటి వద్దనే రీహాబిలిటేషన్‌ ప్రక్రియలనూ కొనసాగిస్తున్నారు’’అని డాక్టర్‌ ధీరజ్‌ ఏ అన్నారు.
 
ఈ తరహా కేసులలో ముందుగానే చికిత్సనందించాల్సిన ఆవశ్యకతను గురించి డాక్టర్‌ బోపన్న కెఎం మాట్లాడుతూ ‘‘ఈ తరహా భారీ రక్తనాళాల వాపు వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చికిత్సనందించని ఎడల మరణ అవకాశాలు గణనీయంగా 50%వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రోగులు ముందుగానే చికిత్స చేయించుకోవడమనేది అత్యవసరం. దురదృష్టవశాత్తు, చాలామంది రోగులు ఈ వాపు చీలిపోయిన తరువాత వస్తుంటారు’’ అని అన్నారు.
 
ఓ నెల తరువాత, తన చివరి ఫాలో‌అప్‌లో ఈ రోగి తలనొప్పి నుంచి మరియు మూర్ఛల నుంచి సైతం ఉపశమనం పొందడంతో పాటుగా తన రోజువారీ కార్యక్రమాలను తిరిగి చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రాణాంతికమైన వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విస్తారమైన పోషకాల గని వీటిలో వున్నాయి.. అందుకే వీటిని... (Video)