Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబెల్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్న శివసేన కార్యకర్తలు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (15:51 IST)
మహారాష్ట్ర రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. తమ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలకు కల్పిస్తూ వచ్చిన భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న శివసేన సైనికులు రెచ్చిపోతున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. 
 
తాజాగా పూణెలోని విధ్వంసం సృష్టించిన రెబెల్ ఎమ్మెల్యే తానాజీ సాంవత్ ఆఫీసును శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పూణెలోని కాట్రాజ్‌లోని బాలాజీ ఏరియాలో ఈ ఘటన జరిగింది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే రెబెల్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల్లో తానాజీ సావంత్ ఒకరు. ప్రస్తుతం వీరంతా అస్సాం రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తున్నారు. 
 
భద్రతను ఉపసంహరించడం వల్ల తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏక్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను శివేసేన ఎంపీ సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రమే భద్రత కల్పిస్తూ వచ్చిందనీ, వారి కుటుంబాలకు కాదని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments