Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టు షాక్..

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:50 IST)
దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ యాదవ్.. తన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేవేసింది. లాలూకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇపుడే ఆస్పత్రి నుంచే రాజకీయం చేస్తున్నారని, ఇక బెయిల్ ఇస్తే పూర్తి స్థాయి రాజకీయనేతగా మారిపోతారని వ్యాఖ్యానించింది. 
 
అయితే, లాలూ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ, లాలూకు కోర్టు 14 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష విధించిందని, 25 ఏళ్లు కాదని, ఆయన ఎక్కడికి పారిపోరంటూ వాదన వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్.. సిబాల్ వాదనను తోసిపుచ్చారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులను వేగవంతంగా విచారించాల్సిందిగా హైకోర్టుకు సూచిస్తామన్నారు. 
 
లాలూకు విధించిన 14 ఏళ్ల శిక్షాకాలంలో 24 నెలలు మాత్రమే శిక్ష అనుభవించారని కోర్టు గుర్తు చేసింది. ఈ సందర్భంగా లాలూకు బెయిల్ మంజూరు చేస్తే ప్రమాదామా? అని సిబల్ కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం.. బెయిల్ ఇవ్వడంలో ప్రమాదం ఏమి లేదు. ఆయన దోషిగా తేలిన ఖైదీ తప్ప. అందుకే లాలూ బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేశామన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments