Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖింపూర్‌ ఘటన: అజయ్ మిశ్రా కుమారుడికి నోటీసులు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (19:01 IST)
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల పైకి కారుతో దూసుకుపోయిన కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు స్పందించారు.
 
రైతుల మృతికి కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లఖింపూర్ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని లక్నో ఐజీ లక్ష్మీ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు. 
 
కాగా, ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీ పోలీసులు షాజహాన్ పూర్ వద్ద అడ్డుకున్నారు. సిద్ధూ ఇద్దరు పంజాబ్ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో కలిసి లఖింపూర్ వెళుతుండగా, పోలీసులు వారి వాహనాలను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

మాజీ ప్రేమికులుగా అడివి శేష్, శృతి హాసన్

గ్లామర్ నటి దిశాపటానీ రాక్సీగా కల్కి లుక్ వచ్చేసింది

భార్యతో లేటెస్ట్ ఫోటో షూట్... దిల్ రాజు ఫోటోలు వైరల్

కమెడియన్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!!

దేవర-పుష్ప2 ఒకే రోజున విడుదలవుతాయా? రూ.30కోట్ల నష్టం?

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

తర్వాతి కథనం
Show comments