యువతి చేతిలో ఓ వ్యక్తి హనీట్రాప్‌కు గురయ్యారు. అంబర్పేట్ పీఎస్ పరిధిలో భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి విడతల వారీగా ఓ వ్యక్తిని కోటి రూపాయలు మోసం చేసింది.
బావ మాటలు విని బ్యూటిషియన్ పేరుతో ఓ యువతి అవతల వ్యక్తికి ఫోన్ చేసి పరిచయం పెంచుకుంది. ఆ తరవాత వెయ్యి రూపాయలతో ట్రాన్సాక్షన్ మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగి కోటి రూపాయలకు దోచుకుంది.
ఆ డబ్బుతో జల్సాలకు అలవాటు పడిన యువతి మరో బాయ్ ఫ్రెండ్‌తో కారులో గోవా ట్రిప్‌లతో పాటు లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. చివరికి యువతి చేతిలో మోసపోయానని చెప్పి సదరు వ్యక్తి కంప్లైంట్ చేయగా 420 ,419,386 కేసు నమోదు చేసి యువతితో పాటు ఆమె బావను, యువతి బాయ్ ఫ్రెండ్‌ను అంబర్ పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు.