Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రిసార్ట్స్ రాజకీయాలు... కర్ణాటక ఎమ్మెల్యేలకు కేరళ పర్యాటక మంత్రి ఆహ్వానం

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్ - జేడీఎస్‌

Webdunia
బుధవారం, 16 మే 2018 (11:42 IST)
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టి కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో కన్నడ రాజకీయాలు ఇపుడు రాజ్‌భవన్‌కు చేరాయి. పైపెచ్చు రిసార్ట్స్ రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు తెరలేపాయి. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేరళ పర్యాటక శాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ ఈ ట్వీట్ చేసింది.
 
ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఎంతో అలసిపోయారు కనుక, కొంత సేదదీరేందుకు పర్యాటక ప్రాంతమైన తమ రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించింది. ఎంతో అందమైన, సురక్షితమైన తమ రిసార్ట్స్‌లో సేదదీరాల్సిందిగా కోరింది. దీనిపై కొత్త ఎమ్మెల్యేల స్పందన సంగతి అలా ఉంచితే, నెటిజన్లు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేశారు. కేరళ టూరిజం శాఖ ఆలోచన అద్భుతమని కొందరు, కొత్త ఎమ్మెల్యేలను అక్కడికి పిలిపించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా! అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటక రాజకీయాలు ఇకపై రిసార్ట్స్ వేదికగా సాగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments