Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో దాచేపల్లి కారాదు... పాతగుంటూరు రేప్‌పై సీఎం సీరియస్

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 యేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరచిపోకముందే.. అదే గుంటూరు జిల్లాలోని పాత గుంటూరులో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల

Webdunia
బుధవారం, 16 మే 2018 (11:09 IST)
గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 యేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరచిపోకముందే.. అదే గుంటూరు జిల్లాలోని పాత గుంటూరులో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులు సత్వరం స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు.
 
అయితే, బాధిత బాలిక కుటుంబ సభ్యులు యువకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌పై రాళ్ల దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన ఐజీ, అర్బన్ ఎస్పీ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. గుంటూరులో 144 సెక్షన్‌ను అమలు చేశారు.
 
ఇదిలావుంటే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పాతగుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని.. .నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments