Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన సైనికులారా, రేపు కీలక పరిణామం... మౌనంగా వుండండి, నేనే యుద్ధం చేస్తా... పవన్ ట్వీట్స్

మెగా బ్రదర్ నాగబాబు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ చేస్తున్నారా? ఆ మూడు ఛానళ్లు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. గతంలో కూడా వైఎస్సార్, ఆమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం చానళ్లపై మండిపడటమే కాకుండా నిషేధం విధించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా జనసేన చీఫ్ పవన్

Advertiesment
జన సైనికులారా, రేపు కీలక పరిణామం... మౌనంగా వుండండి, నేనే యుద్ధం చేస్తా... పవన్ ట్వీట్స్
, శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (21:31 IST)
మెగా బ్రదర్ నాగబాబు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ చేస్తున్నారా? ఆ మూడు ఛానళ్లు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. గతంలో కూడా వైఎస్సార్, ఆమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం చానళ్లపై మండిపడటమే కాకుండా నిషేధం విధించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. నిస్సహాయులైనవారికి సాయం చేయాల్సిందిపోయి వారిని అశ్లీలంగా చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శ్రీరెడ్డి చేసిన వ్యక్తిగత దూషణల వెనుక దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ప్రోత్సాహం వున్నదంటూ పవన్ కళ్యాణ్ వాదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనపై వ్యక్తిగత దూషణలే కాకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అసభ్యకరమైన డిబేట్లు చేశారంటూ పవన్ విమర్శించారు. టీవీ9 శ్రీని రాజుల ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన పవన్ ఆయనపై ఆరోపణలు చేశారు. 
 
ఈ క్రమంలో మరో ట్వీట్ చేస్తూ... తనపై రేపు శ్రీని రాజు పరువునష్టం దావా వేస్తున్నారని పేర్కొన్నారు. ఐతే తన ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడవద్దనీ, ఆ ఛానెల్‌ హెడ్‌లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం తానే చేస్తానంటూ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ టెల్‌పై కేసు వేసిన జియో.. ఎందుకో తెలుసా?