Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:59 IST)
ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్ నగరంలో సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకులో దోపిడీ చేసేందుకు 13 మంది దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి వచ్చారు. అపుడు సమయం సరిగ్గా అర్థరాత్రి 2.30 గంటలు. 
 
బ్యాంకు ప్రధాన ద్వారం షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు జరుపుతూ అలారమ్ ఆన్ చేశాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. 
 
పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ఆ ప్రాంతానికి స్థానికులతో పాటు పోలీసులు కూడా నిమిషాల్లో చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాంకు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments