Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?

పద్మావతి సినిమాపై వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా పద్మావతిపై అంతర్జాతీయంగా రచ్చకు దారితీస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకూడదని ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ఓ యువ

Advertiesment
పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?
, శుక్రవారం, 24 నవంబరు 2017 (12:28 IST)
పద్మావతి సినిమాపై వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా పద్మావతిపై అంతర్జాతీయంగా రచ్చకు దారితీస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకూడదని ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ఓ యువకుడి మృతదేహం జైపూర్‌లోని నహర్ గఢ్ కోటకు ఉరేసుకున్నట్లు వుండటం కలకలం రేపుతోంది. 
 
ఈ సందర్భంగా సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్ లో 'తామెవరి తలలు నరకడం లేదని, ప్రాణత్యాగం చేస్తామ'ని పేర్కొన్నాడు. అయితే దీనిపై పలు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యువకుడు పద్మావతి కోసం ఉరేసుకున్నాడా? లేకుంటే శవాన్ని తెచ్చి సంచలనం కోసం ఇక్కడ ఉరేశారా? అనేదానిపై విచారణ జరుపుతున్నారు.
 
కానీ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ పుత్ కర్ణి సేన తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ పాత్రధారి దీపికా పదుకునే లకు భద్రత పెంచారు. వారి నివాసం వద్ద పోలీసులను మోహరించారు. 
 
పద్మావతి సినిమాపై సుప్రీంకోర్టులో మరో వాజ్యం దాఖలైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. సెన్సార్ సర్టిఫికేట్ రాకముందే జర్నలిస్టులకు ప్రదర్శించారని చెప్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వచ్చే బుధవారం విచారణ జరుగనున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు పద్మావతి సినిమా వివాదంపై ప్రముఖ సినీ నటి, టాక్ షో వ్యాఖ్యాత సిమి గరేవాల్ నిర్వహించిన మధ్యవర్తిత్వం సత్ఫలితం ఇచ్చింది. జైపూర్‌లో మహారాణి పద్మినీ దేవితో సిమి గరేవాల్ సమావేశమయ్యారు. 'పద్మావతి' సినిమాపై ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.
 
తమకు సినిమా పట్ల వ్యతిరేకత లేదని, సినిమాలోని 'ఘామర్' పాటలో 'పద్మావతి' పాత్రధారి డాన్స్ చేయడం పట్ల మాత్రమే విముఖంగా ఉన్నామ ని వెల్లడించినట్లు సమాచారం. దీంతోపాటు సంజయ్ లీలా భన్సాలీతో చర్చించేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని ఆమె ప్రతిపాదించగా, రాణి పద్మినీ దేవి అంగీకరించారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరుపును మార్చినట్లు పురుషుల్ని మార్చేస్తారా?: రాజాసింగ్‌పై ఆ ఇద్దరు ఫైర్